ఓం శ్రీ శరవణ భవాయ నమః భారతదేశంలో ఎన్నో పురాతన, స్వయంభూ క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో పవిత్ర గోదావరి నదీ తీరాన వెలిసిన అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం.. పశ్చిమ గోదావరి జిల్లాలోని నడుపూడి (నది-పూడి) గ్రామంలో కొలువైన శ్రీ స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రం యొక్క సంపూర్ణ స్థల పురాణం, స్వామివారి లీలలు ఈ వ్యాసంలో తెలుసుకుందాం. ఆలయ నేపథ్యం మరియు నడుపూడి గ్రామ నామ విశిష్టత శతాబ్దాల క్రితం, బ్రిటీష్ ప్రభుత్వ కాలంలో సర్ ఆర్థర్ కాటన్ దొర గారు గోదావరి నదిపై బ్యారేజీ నిర్మించకముందు.. ఈ ప్రదేశంలో పశ్చిమ గోదావరి నది విపరీతమైన పరవళ్ళు తొక్కుతూ, వేగంగా ప్రవహిస్తూ ఉండేది. ప్రతి సంవత్సరం వచ్చే గోదావరి నదీ ప్రవాహ వేగానికి ఇక్కడ 'నది-పూడి' (నది పూడిపోవడం వల్ల) ఏర్పడింది. కాలక్రమేణా ఈ ప్రాంతం "నడుపూడి" గ్రామంగా వాడుకలోకి వచ్చింది. స్వామివారి ఆగమనం – స్థల పురాణం పురాణ ప్రసిద్ధి చెందిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు నాసికా త్రయంబకం నుండి గోదావరి నదిలో ప్రయాణం చేస్తూ, తనకు అనుకూలమైన ప్రదేశం కోసం అన్వేషిస్తున్నారు నిత్యము ...